డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయడానికి నిరాకరించడాన్ని సునీల్ గవాస్కర్ సమర్థించాడు. ఒక ఫినిషర్‌గా మ్యాచ్‌ను ముగించాల్సిన బాధ్యతను మిల్లర్ తీసుకోవడం సరైన నిర్ణయమే అన్నాడు. అది అతివిశ్వాసం కాదని, తన సామర్థ్యంపై నమ్మకం మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ విషయంలో మిల్లర్‌ను తప్పు పట్టలేమని, ఒకవేళ ఆ బంతికి పరుగులు వచ్చి ఉంటే అందరూ అతడిని ప్రశంసించేవారని తెలిపాడు.