DCతో మ్యాచ్‌లో GT 210/4 పరుగులు చేసింది. బట్లర్ (52), గిల్ (70), వాషింగ్టన్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ సుదర్శన్ (12) త్వరగానే ఔటైనప్పటికీ, గిల్‌తో కలిసి బట్లర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బట్లర్ ఔటైన అనంతరం.. వాషింగ్టన్‌తో కలిసి గిల్ 104 పరుగులు జోడించాడు. చివర్లో ఫిలిప్స్(14*) జట్టు స్కోరు 200 దాటించాడు. ముఖేష్ 2 వికెట్లు పడగొట్టాడు.