నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న లేపాక్షికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అడ్విక్ వైద్యం కోసం రూ.16 కోట్లు అవసరమని తెలిసి బాలయ్య స్పందించారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. దీంతో బాలయ్య మంచి మనసుకి నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.