RR: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వే నెం. 613 (119)లోని కాసువాగు భూముల రక్షణ కోసం రైతులు చేపట్టిన వంటావార్పు ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పేద రైతుల న్యాయమైన హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రైతుల భూములను కాపాడే వరకు అండగా ఉంటామని, ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి పోరాడుతామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.