ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించగా, అది అనూహ్యంగా బౌలర్లకు సహకరిస్తోంది. స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా బౌలింగ్‌లో మంచి ప్రభావం చూపగలిగారు. దీంతో MI 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఈ పిచ్‌పై ఇది పోరాడగలిగే స్కోరుగానే కనిపిస్తోంది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మాత్రం DCకి ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే.