IPLలో ఆడేందుకు తనకు NOC ఇవ్వలేదని శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే, ఆ తర్వాత తన నిర్ణయంపై వెనక్కి తగ్గిన అతడు.. బోర్డుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. బోర్డు తన పట్ల పారదర్శకతతో వ్యవహరించడం లేదన్నదే తన బాధ అని పేర్కొన్నాడు. కాగా, RCB జట్టుకు ఆడాల్సిన తుషార ఫిట్నెస్ టెస్టులో విఫలం కావడంతోనే బోర్డు అతడికి NOC నిరాకరించింది.