12 ఏళ్ల వయసులో తన ప్రాక్టిస్ ప్రారంభించానని LSG సెన్సేషన్ ప్లేయర్ ముకుల్ చౌదరి తెలిపాడు. ‘మా నాన్నకు పెళ్లి కాకముందు నుంచే తన కొడుకును క్రికెటర్ చేయాలని కలలు కన్నాడు. చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం. ఇది నాకు గోల్డెన్ ఛాన్స్’ అని చెప్పాడు.