163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగుకే ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్లో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ రికల్టన్ చేతిలో పడింది. దీంతో రాహుల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్లో నితీష్ రాణాను బుమ్రా రనౌట్ చేశాడు. దీంతో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.