IPL 2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. లక్నో వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు LSG, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ జట్ల మధ్య జరిగిన 7 మ్యాచుల్లో గుజరాత్ 4, లక్నో మూడు గెలిచాయి. అదేవిధంగా సాయంత్రం 7:30 గంటలకు ముంబై వేదికగా MI, RCB మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 34 సార్లు ఈ జట్లు తలపడగా, 19 విజయాలతో ముంబై ముందంజలో ఉంది.