గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు IPL పాలక మండలి షాక్ ఇచ్చింది. DCతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందుకు గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో గిల్‌కు ఇదే తొలి తప్పిదం కావడంతో కనీస జరిమానాతో సరిపెట్టారు. మరోసారి ఇదే తప్పు పునరావృతమైతే రూ.25 లక్షల జరిమానా విధిస్తారు.