IPL 2026లో తొలి మూడు మ్యాచుల్లో బౌలర్లపై బ్యాటర్ల హవా కొనసాగింది. SRH నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని RCB కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇక KKRపై రోహిత్ శర్మ (78) విజృంభించడంతో ముంబై గెలిచింది. CSKపై రాజస్థాన్ బ్యాటర్లు చెలరేగారు. ఇప్పుడు SRH ఫస్ట్ బ్యాటింగ్ చేయనుండటంతో భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. అసలైన మజా ఇప్పుడు మొదలు కానుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.