RCBతో మ్యాచ్లో RR మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడటంపై వివాదం చెలరేగింది. రూల్స్ ప్రకారం ఇది నిషిద్ధం. కాగా మెడికల్ ఎమర్జెన్సీ వల్లే ఫోన్ వాడినట్లు రోమీ చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో అతడు తీవ్ర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో వారం పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే ఫోన్ వాడకంపై అతడికి ఇప్పటికే BCCI ACU నోటీసులు పంపి విచారణ చేపట్టిందని వార్తలు వస్తున్నాయి.