DCతో జరుగుతున్న మ్యాచ్‌లో GT బ్యాటర్ జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేక సతమతమవుతున్న బట్లర్, ఈ మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బౌల్డ్ అయ్యాడు. దీంతో GT 7.3 ఓవర్లలో 79 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.