ప్రపంచ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన ‘విజ్డెన్’ అవార్డుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం చాటారు. శుభ్మన్ గిల్, జడేజా, రిషభ్ పంత్, సిరాజ్ ‘విజ్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ‘లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్’గా ఎంపికవ్వగా, అభిషేక్ శర్మ ‘లీడింగ్ టీ20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్’ అవార్డును అందుకున్నారు.