ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. గ్రీకో రోమన్ విభాగంలో నితేశ్ (97 కేజీలు) రజతం సాధించగా, ప్రిన్స్ (82 కేజీలు), సచిన్ (67 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. మొత్తంగా ఈ విభాగంలో భారత్ 2 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 5 పతకాలు సాధించింది. టీమ్ ర్యాంకింగ్స్లో 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.