గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కొరకు శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పవిత్ర కార్యం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఐక్యతను నింపుతుందని అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. శివాజీ మహారాజ్ ఒక రాజు మాత్రమే కాదు, ధైర్యానికి, సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు.