WNP: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితులకు వెంటనే వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ రవి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ రత్నమయ్య పానగల్ మండలంలోని 108, 102 అంబులెన్స్ సేవలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేవల పనితీరు, సిబ్బంది సిద్ధత, అత్యవసర పరిస్థితుల్లో స్పందనపై ఆయన సమీక్షించారు.