AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ జరిగింది. మహిళా ప్రయాణికురాలు నాగమణి బ్యాగులో రూ.11 లక్షల బంగారం అపహరించారు. ముగ్గురు మహిళలు బ్యాగులోని బంగారం తీసుకెళ్లినట్లు నాగమణి పేర్కొంది. ఇంటికి వచ్చి బ్యాగులో చూడగా బంగారం పోయినట్లు గుర్తించింది. బంగారం చోరీపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.