WNP: విద్యుత్ ఆర్టిజన్ వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా అంజనేయులు సమ్మెలో పాల్గొని ప్రసంగించారు. విద్యా అర్హతలకు ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీఎస్ రేటు కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.