ADB: మహాత్మా జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నెరడిగొండలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో విద్యా విప్లవానికి నాంది పలికిన గొప్ప మానవతావాది పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.