బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్కు రంగం సిద్ధమైంది. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాణంలో జస్మిత్ కె.రీన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. మధుబాల పాత్ర కోసం గతంలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఖరారైనట్లు టాక్. మధుబాల పాత్రకు అవసరమైన ఆ అమాయకత్వం, క్లాసిక్ అందం కళ్యాణిలో మెండుగా ఉన్నాయని భన్సాలీ బృందం భావిస్తోంది.