MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4,5,6 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏడాది మే నెలలో నిర్వహించవలసిన పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి నిర్వహించడంపై విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏప్రిల్ 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించి మరుసటి రోజు నుంచే పరీక్షలు నిర్వహించడంపై మండిపడుతున్నారు.