BDK: వీకే కోల్ మైన్లో DR. BR అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించారు.