NRPT: కృష్ణ మండలం కాన్ దొడ్డి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు రైతు ఎద్దులను అపహరించారు. కుమ్మరి హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పొలంలో కట్టిన ఎద్దులు సోమవారం కనిపించలేదు. ఉదయం లింగంపల్లి శివారులో చెట్టుకు కట్టిన స్థితిలో లభించాయి. చీకటి లేదా భయంతో దొంగలు వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఎద్దులు దొరకడంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు.