నెల్లూరు వేదాయపాళెం పోలీసులు 30కు పైగా కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ జొన్నలగడ్డ శ్రీనాథ్‌ను సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి, హుబ్లీలలో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.