AP: ప్రకాశం జిల్లా సంతమాగులూరులో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షల ఉచిత కనెక్షన్లు మంజూరు చేశాం. వేసవి పూర్తయ్యేనాటికి ఆ కనెక్షన్లను పూర్తి చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు.