VSP: జిల్లాలో ఎండ తీవ్రత, వడగాడ్పులు కొనసాగుతుండడంతో బ్రాయిలర్ కోళ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఫారాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు బరువు పెరగకపోవడంతో పాటు కొన్నిచోట్ల మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా 33 నుంచి 34 రోజుల్లో బరువు పెరిగే కోళ్లు ప్రస్తుతం 42-43 రోజులు అయినా సరైన బరువుకు చేరడం లేదని రైతులు వాపోతున్నారు.