ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను పెంచి, శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగై, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం వేడి నీటిలో చియా సీడ్స్, అజ్వైన్ లేదా నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు.