కడప కలెక్టరేట్ భవన సముదాయంలో భద్రపరిచిన ఈవీఎం గోడౌన్లను సోమవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.