NGKL: నాగర్కర్నూల్ పట్టణంలోని 21వ వార్డులో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఓ చిన్న బాలుడిపై కుక్క దాడి చేయడంతో నడుము కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం కాలనీవాసులు కుక్కలను తరిమికొట్టారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు, పశువైద్య శాఖ స్పందించడం లేదని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు.