MLG: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని MLG కలెక్టర్ హేమంత్ అధికారులను ఆదేశించారు. వేడుకలు జరిగే ప్రాంగణాల్లో త్రాగునీరు, విద్యుత్, పార్కింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. భద్రతా పరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.