KMM: ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు బత్తుల చంద్రశేఖర్‌పై నేరం రుజువుకావడంతో ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.