NTR: విజయవాడలో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపురానికి చెందిన దేవరపు కొండలరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి రూ.1.40 కోట్ల మేర మోసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు వ్యక్తులు మాటలు విని నకిలీ క్రిప్టో పేరుతో పలు దఫాలుగా రూ.1.40 కోట్ల మేర పెట్టుబడి పెట్టీ మోసపోయినట్లు తెలిపారు.