NTR: విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. బస్సు ముందు భాగం వంతెన అంచున ప్రమాదకరంగా వేలాడింది. స్థానికులు వెంటనే స్పందించి, బస్సులోని సుమారు 38 మంది ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.