TG: హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ ఆశయాలను గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.