SKLM: జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో సోమవారం VC ద్వారా సమీక్ష నిర్వహించారు. దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు.