W.G: వేసవి తీవ్రత, 48 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లాలోని పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. అధిక వేడి వల్ల కోళ్లు ఓవర్హీట్కు గురై చనిపోయే ప్రమాదం ఉన్నందున, జూన్ మొదటి వారం వరకు రైతులు ప్రత్యేక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.