NTR: విజయవాడలో ఎన్.టి.ఆర్ పోలీస్ ఖాకీ స్టూడియోను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ప్రారంభించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరం జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యమన్నారు. AI సాంకేతికతతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.