NRPT: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాధితుల నుంచి 35 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, వాటిని త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.