NZB: ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన మహానేత అని కొనియాడారు.