భారత్ జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో 2 T20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా ఇటీవలే తన 15 పుట్టిన రోజు జరుపుకున్న వైభవ్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అర్హత సాధించాడు.