TG: మహాత్మా గాంధీ, అంబేద్కర్లు దేశానికి రెండు కళ్లని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ పాత్ర ఎంత ఉందో, దేశ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అంత కీలకమని చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించి దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని అంబేద్కర్ నిరూపించారని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం స్పష్టం చేశారు.