NGKL: తమ సమస్యల పరిష్కారం కోసం 9 కార్మిక సంఘాల జేఏసీ పిలుపుతో ఆర్టిజన్ కార్మికుల సమ్మె 7వ రోజుకు చేరింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా బాబాసాహెబ్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి MBNR జిల్లాలో సుమారు 2,500 మంది పాల్గొంటూ, డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని నేతలు తెలిపారు.