HNK: అంబేద్కర్ ఆశయ సాధనే కాంగ్రెస్ లక్ష్యమని DCC అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వెంకట్రామ్ రెడ్డి నేతృత్వంలో స్థానిక కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.