భారత షట్లర్ ఆయుష్ శెట్టి ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ షియుకీ(చైనా)కు ఆయుష్ షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో అతడు 21-18, 15-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. రేపు జరగబోయే ఫైనల్ల్లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుత్‌తో ఆయుష్ తలపడనున్నాడు.