భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవం కల్పించింది. వాంఖడే మైదానంలోని ఒక స్టాండ్‌కు ఆయన పేరును పెట్టింది. ఈ సందర్భంగా శాస్త్రి భావోద్వేగానికి లోనయ్యాడు. 12 ఏళ్ల వయసులో ఈ మైదానంలో తాను తొలిసారి అడుగుపెట్టినట్లు గుర్తుచేసుకున్నాడు. తన పేరిట స్టాండ్ ఏర్పాటు చేయడం చూసి తన తల్లి ఎంతో గర్వపడుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.