DCతో మ్యాచ్లో MI బ్యాటర్లు తడబడ్డారు. DC బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో ముంబై 162/6 పరుగులకే పరిమితమైంది. సూర్య(51) హాఫ్ సెంచరీతో రాణించగా, రోహిత్ (35), నమన్ ధీర్ (28) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలమవ్వడంతో ముంబై భారీ స్కోరు సాధించలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ 2 వికెట్లు తీయగా, ఎంగిడి, అక్షర్, విప్రాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.