ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో SRH- RR జట్ల మధ్య పోరు జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 430 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ టికెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని పోలీసులు కోరారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 11 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.