ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల వారికి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దక్కన్ భవనం రెసిడెన్షియల్ కాగా కమర్షియల్గా ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఫైర్ సేప్టీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటున్నారు. భవనంలో సింథటిక్, టైర్లు ఉండటంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నిన్న రాత్రి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఉదయం భవనం సెల్లార్ నుంచి మంటలు చెలరేగాయని, ఆర్పివేశామని తెలిపారు. భవనం సెల్లార్లో మంటలు వ్యాపించడంతో పిల్లర్లు దెబ్బతిన్నాయి. జేఎన్టీయూ ఇంజినీరింగ్ అధికారుల అభిప్రాయం తీసుకొని కూల్చివేస్తామని చెప్పారు.
మంటలు వ్యాపించడంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. మంటలను ఆర్పే ఫైర్ సిబ్బంది ఇద్దరు కూడా ఇబ్బంది పడటంతో ఆస్పత్రికి తరలించారు. భవన యజమాని మహ్మద్, రహీంపై నిన్ననే కేసు నమోదు చేశారు. వారిద్దరిని పోలీసులు ప్రశ్నించారు.