E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం కూడా ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులు చెల్లించేందుకు కౌంటర్లు అందుబాటులో ఉంటాయని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ట్రెజరీతో పాటు ఆన్లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.